COMEDIAN BRAHMI తిరుమల శ్రీవారిని హాస్యనటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి .. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నటుడు బ్రహ్మానందంను చూసేందుకు భక్తులు భారీగా ఆలయ ప్రాంగణంలో చేరుకోవడంతో.. కాసేపు సందడి వాతావరణం నెలకొంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం
BRAHMANANDAM తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కామెడీ బ్రహ్మా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
BRAHMANANDAM