తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఉద్రిక్తత నెలకొంది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని చేపట్టారు. తుమ్మలగుంట.. చంద్రగిగి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం కావడంతో ముందస్తుగా ఎం.ఆర్పల్లి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా శ్రేణులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను ఇస్తుండగా.. వైకాపా నాయకులు అడ్డుకున్నారు. మరో వీధికి అడ్డుగా ట్రాక్టర్ ట్రాలీ పెట్టి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత.. పోలీసుల రాకతో.. - Tension at thummalagunta
Tension at thummalagunta: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతూరు తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమం నేపథ్యంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే.. పోలీసుల రాకతో వివాదం సద్దుమణిగింది.
దీంతో తెదేపా, వైకాపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తెదేపా నేతలను అక్కడి నుంచి పంపించారు. విద్యుత్ చార్జీలు తుమ్మలగుంట గ్రామంలో పెంచలేదా అని తెదేపా నేతలు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది.. కానీ ఈ వైకాపా ప్రభుత్వంలో ఆ హక్కును కూడా ప్రజలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలో ట్రాక్టర్ అడ్డుపెట్టి ఇలా అడ్డుకోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:జగన్ 'బాదుడే బాదుడు'తో.. ప్రజలు అల్లాడుతున్నారు: చంద్రబాబు