Citizens for Democracy Forum Meeting in Tirupati: తిరుపతిలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ రమేష్ ఆరోపించారు. ఓటర్ల జాబితాల్లో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నారన్న నిమ్మగడ్డ, లోపాలను సవరించాల్సిన బాధ్యత సీఈఓకు ఉందని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఓటర్ల జాబితాపై విమర్శలు ఉన్నాయన్న నిమ్మగడ్డ రమేష్, జాబితా తయారీలో సిబ్బంది వ్యవహారమే విమర్శలకు కారణమని తెలిపారు.
గతంలో బీఎల్వోలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని, ప్రస్తుతం బీఎల్వోలు రాజకీయపార్టీలకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. గతంలో అనుభవం ఉన్న వారికి ఇస్తే తప్పిదాలు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాలో లోపాలను సవరించకుండా ముసాయిదా జాబితా ఇచ్చారన్నారు. ఓట్లను గంపగుత్తగా తొలగించకూడదన్న సీఈసీ నిబంధనలు అమలు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన జరగడం లేదని నిమ్మగడ్డ రమేష్ (Nimmagadda Ramesh Kumar) మండిపడ్డారు.
అక్రమ కేసుల నిజానిర్ధారణకు త్రిసభ్య కమిటీ - పాదర్శక ఎన్నికలే లక్ష్యంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అడుగులు
రాజ్యాంగేతర శక్తులుగా సలహాదారులు: రాజ్యాంగ విరుద్ధంగా వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి సీఎఫ్‌డీ తీసుకెళ్లిందని గుర్తుచేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం సలహాదారులను నియమించిందని, వారు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని తెలిపారు.
ఏ ప్రతిపాదికపైన ప్రభుత్వం 50 మంది సలహాదారులు: ప్రభుత్వం మీద పార్టీల ప్రభావం పడకూడదని, ప్రభుత్వ సిబ్బందిని దుర్వినియోగం చేయకూడదని నిమ్మగడ్డ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి 50 మంది సలహాదారులు ఉన్నారని, ఏ ప్రతిపాదికపైన ప్రభుత్వం 50 మంది సలహాదారులును నియమించిందో తెలియదని నిలదీశారు. 13 మంది సలహాదారులకు కేబినెట్ హోదా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈనెల 13న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
ఓటర్లను ప్రభావితం చేసే సంస్థలపై చర్యలు తీసుకోవాలి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్
విమర్శ చాలా మేలు చేస్తుంది: మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల తప్పులు ఎత్తిచూపాలని, రాజ్యాంగపాలన లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subramanyam) అన్నారు. చట్టసభల్లో ప్రజాస్వామ్య స్పూర్తితో చర్చలు జరగాలన్న ఎల్వీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడటంతో ప్రశ్నించడానికే సీఎఫ్‌డీ ఏర్పడిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో విమర్శ చాలా మేలు చేస్తుందన్న ఎల్వీ, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
పాలకులే న్యాయం చేయకపోతే పౌరులు ఎక్కడికి వెళ్లాలి: రాజ్యాంగ రచన సమయంలో అప్పటి నేతలు ఎంతో మేథోమథనం జరిపారన్నారు. పౌరులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. పాలకులే న్యాయం చేయకపోతే పౌరులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోయి శ్రీలంక దివాలా తీసిందని, పౌరుల ఆందోళనతో పాలకులు దేశం విడిచిపారిపోయారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని సాధించడం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవడం కూడా అంతే కష్టమని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.
Citizens for Democracy Press Meet స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమే సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తాం..
చీకటి వెనుక వెలుగు ఉంటుంది: వెలుగు నీడల మధ్య దోబూచులాడే స్థితిలో నేటి సమాజం ఉందని జస్టిస్ భవానీ ప్రసాద్ (Justice Bhavani Prasad) అన్నారు. చీకటి వెనుక వెలుగు ఉంటుందని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసిందని పేర్కొన్నారు. సామాజిక స్పృహ సమాజంలో కొరవడుతోందన్న జస్టిస్ భవానీ ప్రసాద్, అన్యాయాన్ని ఎదుర్కోవాలనే తపన ఇవాళ కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అనుకుంటే శాసనసభలో చట్టాలు వస్తున్నాయని, శాసనసభ్యులు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని జస్టిస్ ఎం.ఎన్.రావు (Justice MN Rao) ఆరోపించారు. రాజకీయ నాయకులకు న్యాయవ్యవస్థపై అనుమానాలున్నాయని విమర్శించారు.
మేధావులు మౌనం వీడాలి: మేధావులు మౌనం వీడి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొవాలని జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల్లో సమాంతర వ్యవస్థ నడుస్తోందన్న జస్టిస్ లక్ష్మణరెడ్డి, శాసనవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థను చెరపట్టిందని అన్నారు. వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు అని పలు సందర్భాల్లో మంత్రులు అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని, సెక్షన్ 30 ఇంతకాలం కొనసాగుతున్న రాష్ట్రం ఏపీనే అని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై పరోక్షంగా దాడి చేస్తున్నారని అన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ మరిన్ని సమస్యలపై అధ్యయనం చేయాలని సూచించారు.
Citizens for Democracy Organization Meeting: విజయవాడలో 'సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ' సంస్థ ఆవిర్భావ సభ..
రాష్ట్రంలో రాజ్యాంగ పాలన జరగడం లేదు - ప్రజాప్రతినిధుల తప్పులు ఎత్తిచూపాలి: నిమ్మగడ్డ రమేష్