తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. అయితే.. ముందుగానే పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తుడా చైర్మన్ పదవీకాలం పొడిగింపు.. మరో రెండేళ్లు కొనసాగనున్న చెవిరెడ్డి - tuda chairman
కీలకమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వేళ.. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మంత్రి పదవి రేసులో ఉన్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. చెవిరెడ్డి పదవీకాలాన్ని పొడిగించడం పట్ల పలురకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తుడా చైర్మన్ పదవీకాలం పొడిగింపు.. మరో రెండేళ్లు కొనసాగనున్న చెవిరెడ్డి
వాస్తవానికి 2022 జూన్ 12 తేదీన చెవిరెడ్డి పదవీ కాలం ముగియాల్సి ఉంది. అయితే.. మంత్రిపదవులకు సంబంధించి తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో.. కేబినెట్ రేసు నుంచి ఆయన్ను తప్పించేందుకే తుడా చైర్మన్ పదవీకాలాన్ని ముందస్తుగా పొడిగించినట్టు అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజా పదవీకాలం పెంపు ప్రకారం.. 2022 జూన్ 12 నుంచి 2024 జూన్ 12 తేదీ వరకూ తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనసాగనున్నారు.