Suicide Attempt: తిరుపతి రైల్వేస్టేషన్‌లో రైలు బోగీ పైకెక్కి.. ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన చాకలి పెద్దోల అనే వ్యక్తి .. రైలు బోగిపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించాడు. సాధారణ ప్రయాణికుడిగా స్టేషన్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి, అకస్మాత్తుగా రైలు బోగిపైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే రైల్వేరక్షక దళ సిబ్బంది స్పందించి.. విద్యుత్‌ను నిలుపుదల చేసి అతన్ని కాపాడారు. రైల్వే చట్టం ప్రకారం.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసి.. కౌన్సిలింగ్ ఇచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి రైల్వేస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Suicide Attempt: తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. రైలు బోగీ పైకెక్కి ఎకంగా హె టెన్షన్ వైర్లను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది వెం.. సదరు వ్యక్తిని కాపాడారు.
చాకలి పెద్దోల ఆత్మహత్యాయత్నం