Celebrities: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సౌత్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మెంబర్ పుష్ప సత్యనారాయణ.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న ప్రముఖులకు తితిదే ఆధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు
Celebrities: ఆలయాల దర్శనంలో పలువురు ప్రముఖులు - సౌత్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మెంబర్ పుష్ప సత్యనారాయణ
Celebrities: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు.
తిరుపతి, శ్రీకాళహస్తీశ్వర ఆలయాలను సందర్శించిన పలువురు ప్రముఖులు
వీవీఎస్ లక్ష్మణ్:తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి నిర్వహించే రుద్రాభిషేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయం తరపున తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.
ఇదీ చదవండి: TTD: ఆ ఉద్యోగి స్నేహితుడి వల్లే సినిమా పాటలు: తితిదే