Minister Peddireddy Ramachandra Reddy: పజాసంకల్ప యాత్ర వైకాపా శ్రేణులకు పండగలాంటిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఐదేళ్లు పూరైన సందర్బంగా తిరుపతిలో వైకాపా జెండాను ఆయన ఎగురవేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం పీఎల్ఆర్ జాబ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందిన 109 మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. పీఎల్ఆర్ జాబ్ సెంటర్ ద్వారా రెండున్నరేళ్లలో 11,897మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 3648 కిలోమీటర్లు పాదయాత్రతో ప్రజల మధ్య ముఖ్యమంత్రి జగన్ గడిపారని. ప్రజల మనోభావాలు తెలుసుకుని మేనిఫెస్టో ప్రకటించారని ఆయన తెలిపారు. మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి.. జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. దేశంలోని సీఎంలకు జగన్ మోహన్ రెడ్డి ఆదర్శమన్నారు.
పజా సంకల్ప యాత్ర వైకాపాకు పండగలాంటిది: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పీ ఎల్ ఆర్ జాబ్ సెంటర్
Minister Peddireddy Ramachandra Reddy: పజాసంకల్ప యాత్ర వైకాపా శ్రేణులకు పండగలాంటిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ఐదేళ్లు పూరైన సందర్బంగా తిరుపతిలో వైకాపా జెండాను ఆయన ఎగురవేసి.. సంబరాలు జరుపుకున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రజాసంకల్ప యాత్ర వైకాపా శ్రేణులకు పండగలాంటిది. 3648 కిలోమీటర్లు పాదయాత్రతో ప్రజల మధ్య ముఖ్యమంత్రి జగన్ గడిపారు. ప్రజల మనోభావాలు తెలుసుకుని మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి.. జగన్ మాత్రమే. దేశంలోని సీఎంలకు జగన్ మోహన్ రెడ్డి ఆదర్శం :-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి
ఇవీ చదవండి: