Somu Veerraju Comments on YSRCP: ప్రభుత్వం ముందు చూపు చర్యలు లేకపోవడం వల్ల వరదలతో ఉభయ గోదావరి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు ఆరోపించారు. ఏటిగట్లు పటిష్టానికి నిధులు కేటాయించకపోవడంతో లంక గ్రామాలు చాలా నీటమునిగాయని తిరుపతిలో ఆయన అన్నారు. సాయం అందడం లేదంటూ అంబేద్కర్ జిల్లాలో మంత్రిపైనే తిరగపడ్డారని సోము వీర్రాజు గుర్తు చేశారు.
ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే.. వరదలతో తీవ్ర నష్టం: సోము వీర్రాజు
BJP State President: వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలు విమర్శలు చేశారు. మోదీ కేటాయించిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. రోడ్ల కోసం కేంద్రం మూడు లక్షల కోట్లు ఖర్చు పెడితే.. రాష్ట్రం రూ.300 కోట్లు కూడా పెట్టకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే వరదలతో భారీ నష్టం వాటిల్లిందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారులపై నెట్టుతున్నారని సోము అన్నారు. సీఎం ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఆలయాల నిధులను దేవాదాయ శాఖ డ్రా చేసుకోవడంపై భాజపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దేవున్ని అడ్డు పెట్టుకొని వైకాపా రాజకీయాలు చేస్తొందని ఆరోపించారు. పవన్ కల్యాణ్, భాజపాను విమర్శించే నైతిక హక్కు దేవాదాయశాఖ మంత్రికి లేదన్నారు. కేంద్రం మూడు లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రోడ్లు వేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్లు పెట్టలేకపోతుందన్నారు. కేంద్రం ఇచ్చే సర్పంచుల నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. మోదీ కేటాయించిన నిధులతో మాత్రమే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని సోము వీర్రాజు అన్నారు.
ఇవీ చూడండి: