ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక్కడ శ్రీ కాళహస్తిలో, అక్కడ అరుణాచలంలో - 'ఒకటి అనేకం, అనేకం ఒకటి' - కార్తీక మాసం

Bharani Deeposthvam: కార్తీక మాసం పురస్కరించుకుని వివిధ పుణ్య క్షేత్రాల్లో భరణి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Bharani_Deeposthvam
Bharani_Deeposthvam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 1:04 PM IST

Bharani Deeposthvam: కార్తీక మాసం పురస్కరించుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా భరణి దీపోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే చొక్కాని మహోత్సవాన్ని పురస్కరించుకొని భరణి దీపోత్సవాన్ని ఆగ మోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవం సందర్భంగా ఆలయంలోని శ్రీ జ్ఞానాంబిక అమ్మవారి ఆలయానికి ఎదురుగా వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య హోమ పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు. ఈ రోజు రాత్రి ఆలయంలో జరిగే చొక్కాని మహోత్సవాన్ని ఈ దీపాలతోనే ప్రారంభించనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీశైల మహా క్షేత్రం కార్తీక మాసోత్సవ వేడుకలతో సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచి శ్రీశైల క్షేత్రంలో భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపారాధనలు నిర్వహించుకుంటున్నారు. భక్తులు తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. దీపారాధనలు చేసుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలం నుంచి కార్తీక పౌర్ణమి ఘడియలు రానున్నాయి. సాయంత్రం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కృష్ణవేణి నదీమ తల్లికి దేవస్థానము అర్చకులు పుణ్యనదిహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

దీపాల వెలుగుల్లో 'కార్తిక' జాతర - పురుషోత్తపట్నంలో కనుల పండువగా ఉత్సవం

ఈరోజు రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం ఉత్సవం కన్నుల పండుగ జరగనుంది. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి పల్లకిలో గంగాధర మండపం వద్దకు చేరుస్తారు. అక్కడ సంప్రదాయ బద్ధంగా జరిగే జ్వాలా తోరణోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు జరగనున్న జ్వాలాతోరణ ఉత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొననున్నారు.

మరోవైపు తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయంలో ఘనంగా భరణి దీపోత్సవం నిర్వహించారు. ఆలయ గర్భగుడి నుండి ఒక దీపం తీసి, గర్భగుడి ముందున్న హాలులో ఐదు దీపాలను వెలిగించి, వాటిలో ఒక దీపాన్ని వెలిగించి భక్తులకు చూపించడాన్ని భరణి దీపం అంటారు. ఒకటి అనేకం.. అనేకం ఒకటి అనేది దీని తాత్పర్యం. ఇందుకోసం ఈరోజు అన్నమలైయర్ ఉన్నములై అమ్మన్‌కు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం సరిగ్గా 4 గంటలకు భరణి దీపం వెలిగించారు. ఇందుకోసం దాదాపు 5 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆలయం వెనుక ఉన్న 2,668 అడుగుల ఎత్తైన కొండపై మహా దీపం వెలిగించనున్నారు.

ఈరోజు వెలిగించనున్న ఈ మహాదీపం 11 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఇందుకోసం 4 వేల 500 కిలోల నెయ్యి, 1,500 మీటర్ల కాటన్ క్లాత్‌ అవసరమవుతుంది. తిరువణ్ణామలైలో భరణి దీపం ఉత్సవాన్ని తిలకించేందుకు 35 లక్షల మంది వరకు భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు భక్తులకు మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు చేశారు.

జ్యోతిర్లింగ క్షేత్రంలో కార్తిక శోభ - అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం

ABOUT THE AUTHOR

...view details