ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రమదానంతో రోడ్లను బాగుచేసుకున్న కుప్పం ఆటో డ్రైవర్లు

Auto Drivers: పురపాలక అధికారుల నిర్లక్ష్యంతో పాడైపోయిన రహదారులను స్వయంగా బాగుచేసుకునేందుకు సిద్దమయ్యారు.. కుప్పం ఆటోడ్రైవర్లు. రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టిన, అధికార్లు పెడ చెవినే పెడుతున్నారని.. చేసేది లేక, తామే శ్రమదానం చేసుకుంటున్నామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. పాడైపోయిన రోడ్లతో ఆటోలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని సదరు డ్రైవర్లు వాపోతున్నారు.

Auto Drivers
ఆటోడ్రైవర్ల శ్రమదానం

By

Published : Oct 30, 2022, 10:14 AM IST

Updated : Oct 30, 2022, 2:21 PM IST

Auto Drivers Removed Soil On Road: ప్రతిపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్ల దుస్థితిపై ఆటో డ్రైవర్లు స్పందించారు. కుప్పం నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్లే రహదారిలో రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద మట్టి, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయాయి. భారీ వర్షాలతో పేరుకుపోయిన బురదతో వాహనాలు పాడైపోతున్నాయి. చిన్న వాన చినుకు పడిందంటే చాలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఆ మార్గంలో వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికార్లకు ఎన్ని సార్లు విన్నపించినా, స్పందన రాకపోవడంతో.. స్వయంగా ఆటోడ్రైవర్లే రంగంలోకి దిగారు. శ్రమదానంతో రోడ్లను శుభ్రం చేసుకుని.. బురదను తొలగించి, గుంతలు పూడ్చారు.

రహదారిపై మట్టిని తొలగించిన ఆటోడ్రైవర్లు
Last Updated : Oct 30, 2022, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details