ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతిపై అత్యాచార యత్నం.. రక్షించిన స్థానికులు - ap news

Rape Attempt: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్​తో పాటు మరో ఇద్దరు అత్యాచారయత్నం చేశారు. ఆమె చాకచక్యంగా వారి నుంచి తప్పించుకుని సమీపంలోని గుడి వద్దకు చేరుకుని స్థానికులకు విషయం తెలిపింది.. వాళ్లు దుండగులను పట్టుకునేందుకు యత్నించగా పారిపోయారు. ఈ విషయం పోలీసులకు చెప్పేందుకు ఫోన్​ చేసినా స్పందించలేదని స్థానికులంటున్నారు.

rape attempt
rape attempt

By

Published : Jun 26, 2022, 10:51 PM IST


Rape Attempt: తిరుపతి జిల్లా చంద్రగిరిలో మృగాళ్లు రెచ్చిపోయారు. ఓ యువతిని ముగ్గురు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె సమీపంలోని ఓ ఆలయం వద్దకు చేరుకుని.. స్థానికులకు తెలిపింది. వాళ్లు దుండగులను పట్టుకునేందుకు యత్నించగా.. ఆటో వదిలి పారిపోయారు. పోలీసులకు ఫోన్​ చేసినా స్పందించలేదని స్థానికులు తెలిపారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి ఆటోలో ఓ యువతి చంద్రగిరికి బయలుదేరింది. తొండవాడ వద్దకు చేరుకోగానే ఆటోలోని ఇతర ప్రయాణికులు దిగిపోయారు. ఒంటరిగా ఉన్న యువతిని ఆటో డ్రైవర్ మరో ఇద్దరు వ్యక్తులు చీకట్లోకి తీసుకెళ్ళి దాడి చేసి అత్యాచారయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకుని ముక్కోటి శివాలయం వద్దకు చేరుకుంది ఆ యువతి.. ఆలయం వద్ద ఉన్న స్థానికులు ముగ్గురిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో.. ఆటో వదిలి పరారయ్యారు. మెదటగా స్థానిక సీఐ, ఎస్సైకి సమాచారం ఇద్దామని ఫోన్ చేసినా వారు స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. తర్వాత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని తీసుకెళ్లినట్లు అక్కడున్నవారు తెలిపారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details