Atrocities Under Influence of Alcohol: ఇటీవల కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలామంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోతున్నాయి. ఎంతోమంది దంపతులు, అన్నదమ్ముల మధ్య కలహాలు చోటు చేసుకుని.. విడిపోయిన పరిస్థితులు కూడా చాలానే చూశాం. మద్యం మత్తులో ఇటీవల కాలంలో ఎన్నో యాక్సిడెంట్స్ కూడా సంభవించాయి. దీంతోపాటు మద్యం మత్తులో హత్యలకు, అత్యాచారాలకు, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యం మత్తులో పడిన వ్యక్తులు సృష్టించిన అరాచకాలెన్నో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలే తిరుపతి, కర్నూలు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్య చేస్తే.. మరో వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.
Petrol Attack on Couple: దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు
తిరుపతి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తొట్టంబేడు మండలంలోని రౌతు సూరమాలలో ఎస్టీ కాలనీకి చెందిన చెంచయ్య, అతడి భార్యకు మధ్య వివాదం నెలకొంది. దీంతో వారిని సర్దిచెప్పేందుకు వారి బంధువైన చింతయ్య(33) అనే వ్యక్తి మధ్యవర్తిగా వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురికి సర్ది చెప్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న చెంచయ్య.. రోకలిబండతో చింతయ్య తలపై కొట్టాడు. దీంతో చింతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి చెంచయ్య పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.