ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD: వ్యాపార కేంద్రంలా తితిదే.. 30 మంది పీఠాధిపతుల నిరసన - టీటీడీ ఆధ్యాత్మిక కేంద్రంగా వ్యాపార కేంద్రమా

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు

Tirumala Tirupati Devasthanam
తిరుమల తిరుపతి దేవస్థానం

By

Published : Nov 24, 2022, 11:21 AM IST

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని కోరగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని భద్రతా సిబ్బంది తెలిపారు. ముందుగా లేఖ ద్వారా తెలియజేసినా ఇలా చేస్తారా అంటూ వారు అక్కడే కాసేపు నిరసన తెలిపారు. అనంతరం శ్రీనివాస మంగాపురంలో విలేకరులతో మాట్లాడారు.

విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని ధ్వజమెత్తారు. అలాగైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామన్నారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి తితిదేలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details