AP NGO President Bandi Srinivasa Rao Comments: సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం సంక్షోభంలో పడేయడం ఎంత వరకు సమంజసమంటూ ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిల్లో ప్రభుత్వం ఉందంటూ విమర్శించారు. తమకు రావలసిన జీపీఎఫ్ నిధులు, డిఏలను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్నిదర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులను సంక్షోభంలో పడేయటం సరికాదు: బండి శ్రీనివాసరావు - ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్
AP NGO President Bandi Srinivasa Rao Comments: రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులను సంక్షోభంలో పడేసిందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమకు రావలసిన జీపీఎఫ్ నిధులు, డిఏలను విడుదల చేయాలని కోరారు.
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు
"ఒకటో తేదీన జీతం వస్తుందేమో అని వేచి చూసినా.. అది రావడంలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయద్దు అని చెప్పడం లేదు.. కానీ సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచే ప్రభుత్వ ఉద్యోగులను సంక్షోభంలో పడేయటం సరికాదు". - బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చదవండి: