ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court Bail to TDP Leader Challa Babu: పుంగనూరు ఘటనలో చల్లా బాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు - ap news

AP High Court Bail to TDP Leader Challa Babu in Punganur Incident Case: టీడీపీ నేతలపై నమోదైన వివిధ కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పుంగనూరు ఘటన కేసులో చల్లా బాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న కేసులో పత్తిపాటి పుల్లారావుకు, మరో 67 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు ఊరట లభించింది. మరో కేసులో చింతమనేని ప్రభాకర్​కు ముందస్తు బెయిల్ మంజూరైంది.

ap_high_court_bail_to_tdp_leader_challa_babu
ap_high_court_bail_to_tdp_leader_challa_babu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 5:51 PM IST

AP High Court Bail to TDP Leader Challa Babu inPunganur Incident Case:చిత్తూరు జిల్లాపుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ చల్లా బాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.45 వేల పూచీకత్తుతో షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. ఆగస్టు 4న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పుంగనూరు పట్టణ శివార్లలో ఘర్షణ చోటు (Punganur Violence) చేసుకుంది. చల్లా బాబుపై వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేశారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే నాలుగు కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మిగతా మూడు కేసుల్లో చల్లా బాబు లొంగిపోయాడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. చల్లా బాబుకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరుపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, అనుమోలు జ్యోతిరత్న వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గతంలో టీడీపీ కార్యకర్తలకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

TDP Leader Challa Ramachandra Reddy Surrendered: పోలీసుల ఎదుట లొంగిపోయిన చల్లా రామచంద్రారెడ్డి

Relief to TDP Leader Pattipati Pullarao From Case of Obstructing Police Duties :హైకోర్టులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మరో 67 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు ఊరట లభించింది. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో చిలకలూరిపేట జాతీయ రహదారిపై భారీగా వాహనాలతో చేరుకొని పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. 41A నోటీసులు ఇచ్చి టీడీపీ నేతలను విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసులో ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్స్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

Anticipatory Bail for Chintamaneni Prabhakar : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ పెడుతున్న అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన.. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra) నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో స్టేషన్​లో బెయిల్ పత్రాలు సమర్పించారు. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Chittoor SP Rishanth Reddy On Punganur Issue: 'పుంగనూరు ఘటనకు కారకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు'

ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం కూలిపోవాలని, ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. పొద్దున్నే న్యూస్ పేపర్ కూడా రాకముందే టీడీపీ నాయకుల ఇంటికి పోలీసులు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే జగన్ మోహన్ రెడ్డి అధికారానికి దూరం అవుతాడనీ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, వెంటనే ప్రతిపక్ష నాయకులపై పెట్టిన ప్రతి కేసుని మళ్లీ విచారణ చేయిస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

Petition in High Court on Punganur Incident: సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు.. ప్రాథమిక ఆధారాలున్నాయి: హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details