ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TIRUMALA: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిపై స్వామి, అమ్మవార్లు కొలువుదీరి 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

TIRUMALA
TIRUMALA

By

Published : Jul 18, 2022, 7:05 AM IST

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో శ్రీమలయప్పస్వామి వారిని గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా విచ్చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారు వాకిలివద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు నివేదించారు.

తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద జీయర్‌, చిన జీయర్‌, తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిపై స్వామి, అమ్మవార్లు కొలువుదీరి 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details