Anganwadis Protest: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం శిరసనంబేడు జాతీయ రహదారిపై 120 మంది అంగన్వాడీ కార్యకర్తలు అర్ధరాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. నేడు విజయవాడలో జరగనున్న అంగన్వాడీల ఆవిర్భావ సభ కోసం తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి వెళ్తున్న వారిని పోలీసులు అనుమతులు లేవని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సభ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామని.. అయినా మమ్మల్ని ఆపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై ఆందోళన
Anganwadis Protest: విజయవాడలో అంగన్వాడీల ఆవిర్భావ సభ కోసం వెళ్తున్న వారిని తిరుపతిలోని శిరసనంబేడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు తిండి, నిద్ర లేకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు
Last Updated : Apr 24, 2022, 1:55 PM IST