Minister vs MLA on Tirumala Darshan issue: శ్రీవారి దర్శానార్థం తిరుమలకు వచ్చే శాసన సభ్యులకు తితిదే ఈవో ధర్మారెడ్డి కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ... గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన ఆరోపణపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తితిదేపై ఎమ్మెల్యే అన్నా విమర్శలు చేయడం తగదని మంత్రి అంబటి వెల్లడించారు. అదనపు దర్శన టికేట్లు కావాలని తితిదేను కోరితే ఇస్తారని అంబటి రాంబాబు అన్నారు. నేడు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు అంబటికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసిన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. దర్శన అనంతరం మంత్రి అంబటి రాంబాబు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాాడారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు సైతం అప్పటి ఈవో తమకు కావాల్సిన దర్శన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. అప్పటి ఈవో, జేఈవోలు నా ప్రోటోకాల్ నాకు ఇచ్చారన్నారు. అన్నా రాంబాబు అలాంటి ఆరోపణలు చేయడం వంద శాతం తప్పు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
'ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. దేవుడి వద్ద అధికార, విపక్షాలంటూ తేడా లేదు. చిన్న చిన్నగా ఒక్కరిద్దరు తక్కువ అవ్వడం వల్ల అలాంటి ఆరోపణలు చేయడం తప్పు. నేను విపక్షంలో ఉన్నప్పుడు నన్ను మంచిగానే మర్యాదించారు. ఇప్పుడు అలాగే మర్యాదిస్తున్నారు.'- అంబటి రాంబాబు, మంత్రి