ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ALLEGATIONS: తిరుపతి మ్యాన్​హోల్ ఘటన.. అధికారులపై కార్మిక సంఘాల ఆగ్రహం - తిరుపతి జిల్లా తాజా వార్తలు

ALLEGATIONS: తిరుపతిలో మ్యాన్‌హోల్‌లోకి దిగి ముగ్గురు మరణించిన ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య విభాగంలో ఉన్న కార్మికులను మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు ఎందుకు పంపారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని ప్రకటించిన నగరపాలక సంస్థ..ఇప్పుడు వాస్తవాలను కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ALLEGATIONS
తిరుపతి మ్యాన్​హోల్ ఘటన.. అధికారులపై కార్మిక సంఘాల ఆగ్రహం

By

Published : Jun 17, 2022, 12:36 PM IST

Updated : Jun 17, 2022, 4:23 PM IST

ALLEGATIONS: తిరుపతి తుమ్మలగుంట రహదారిలో మురుగు కాలువలు శుభ్రం చేస్తూ మ్యాన్‌హోల్‌లోకి దిగి ముగ్గురు చనిపోయిన ఘటనకు..అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుభవం, అవగాహన ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని పంపాల్సిన నగరపాలక అధికారులు… ఆరోగ్య విభాగంలో పని చేసిన వారిని మ్యాన్‌హోల్లోకి దింపి ప్రాణాలు తీశారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒప్పంద కార్మికులుగా విధుల్లోకి వచ్చిన ఆర్ముగం, మహేశ్‌.. కమిషనర్ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నచిన్న ట్యాంకులను శుభ్రం చేసే వారు. ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా మ్యాన్ హోల్లోకి వారిని దింపడం వల్లే విషవాయువులు పీల్చి చనిపోయారని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి మ్యాన్​హోల్ ఘటన.. అధికారులపై కార్మిక సంఘాల ఆగ్రహం

నగరపాలక సంస్థ అధికారులు కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే కార్మికులు బలయ్యారని.. కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మురుగు కాలువలు శుభ్రం చేయాల్సి ఉన్నా..మధ్యాహ్నం వేళల్లో ఎందుకు పంపారని ప్రశ్నిస్తున్నారు. నిపుణులైన అధికారులు పర్యవేక్షణ లేకుండా..మ్యాన్‌హోల్లో దింపి ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు.

భూగర్భ మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నా.. వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 2 కోట్ల రూపాయలు నిధులు విడుదలైనా.. వాటిని ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 17, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details