ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల సమాచారం.. నేటి అర్ధరాత్రి నుంచే సర్వదర్శనం టైంస్లాట్‍ టోకెన్లు - తిరుమల

TTD: తిరుమల శ్రీవారి టైంస్లాట్‍ సర్వదర్శనం టోకెన్ల జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టోకెన్లు లేని భక్తులు నేరుగా క్యూ కాంప్లెక్స్​ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Sarvadarshanam darshan tokens
టైంస్లాట్‍ సర్వదర్శనం టోకెన్లు

By

Published : Oct 31, 2022, 7:36 PM IST

Updated : Oct 31, 2022, 8:18 PM IST

Tirumala Venkateshwara Swamy: తిరుమల శ్రీవారి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్ల్​లో ఏర్పాటు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ ప్రారంభిస్తామని తెలిపారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా జారీ చేసే టోకెన్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రారంభ దశలో శని, ఆది, సోమవారాల్లో 25వేలు, మిగిలిన నాలుగు రోజులు 15వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు లేని భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి క్యూ కాంప్లెక్స్‌లో నిరీక్షించి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు.

తితిదే ఈఓ ధర్మారెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2022, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details