Actor Vishal : రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని సినీ నటుడు హిరో విశాల్ స్పష్టం చేశారు. అతను హిరోగా నటించిన లాఠీ చిత్రం.. ప్రీ రీలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉందని అన్నారు. ఓ నటుడిగా ప్రజలకు శాసనసభ్యుడి కంటే ఎక్కువగా సేవ చేస్తున్నానని పెర్కొన్నారు. ప్రస్తుతానికి సినిమాల మీద తప్ప రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. లాఠీ చిత్రం వసూళ్లలో ఒక్కో టికెట్ నుంచి ఒక రూపాయి చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు.
నేను కుప్పం నుంచి పోటీ చేయటం లేదు : నటుడు విశాల్ - upcoming elections in ap
Actor Vishal : తాను ఎన్నికలలో పోటీ చేయటం లేదని సినీ నటుడు విశాల్ అన్నారు. తాను కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వచ్చిన వందతులు.. నిజం కాదని తెలిపారు. తాను ఇప్పుడు సినిమాలలో నటిస్తూ సంతోషంగా ఉన్నానని అన్నారు.
నటుడు విశాల్
"కుప్పం ప్రజలు నాకు చాలా బాగా తెలుసు. దాదాపు మూడు సంవత్సరాలు కుప్పంలో పనిచేశాను. మా నాన్న కుప్పంలో వ్యాపారం చేశారు. నేను నటుడిని కాకముందు కుప్పంలో పనిచేశాను. నేను కుప్పంలో పోటి చేయాను. నేను నటుడిగా సంతోషంగా ఉన్నాను." - విశాల్, సినీనటుడు
ఇవీ చదవండి: