Balakrishna Watched Movie with Family: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి ఎస్వీ థియేటర్‌లో బాలకృష్ణ సందడి చేశారు. సంక్రాంతికి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లె వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్‌కి వచ్చిన ఆయన వీరసింహారెడ్డి సినిమాను తిలకించారు. అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది.. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేశారు. బాలకృష్ణ, వసుంధర, మోక్షజ్ఞ, నారా బ్రహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు, వారి పిల్లలు కలసి వీరసింహారెడ్డి సినిమా చూశారు. అనంతరం 50కేజీల భారీ కేక్‌ను బాలయ్య అభిమానులు కట్ చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి 'వీరసింహారెడ్డి'ని చూసిన బాలకృష్ణ - తిరుపతి వార్తలు
Balakrishna Watched Movie with Family: బాలకృష్ణ.. వీరసింహారెడ్డి సినిమాను కుటుంబ సబ్యులతో కలసి చూశారు. సంక్రాంతికి నారావారిపల్లె వెళ్లిన కుటుంబ సభ్యులు.. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్వీ థియేటర్‌లో సినిమాను వీక్షించారు. దీంతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొంది. జై బాలయ్య..జై జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
బాలకృష్ణ