Tirupati robbery case: తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈనెల 3వ తేదీ 35 లక్షల రూపాయల దారి దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి కృష్ణమూర్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 32.5 లక్షల నగదుతో పాటు ఓ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం: తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో సూత్రధారి, వైకాపా కార్యకర్త కృష్ణమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల మూడో తేదీన తేదీన శంకర్‌రెడ్డి అనే రియల్టర్ వద్ద కృష్ణమూర్తి బ్యాచ్ 35 లక్షలు కాజేశారు. కృష్ణమూర్తిని పట్టుకున్న పోలీసులు... నిందితుడి నుంచి 32.5 లక్షల నగదు, ఓ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. 35 లక్షల రూపాయలు ఇస్తే 70 లక్షలు బ్లాక్ మనీ ఇస్తామంటూ... హైదరాబాద్ కు చెందిన రియల్టర్ శంకర్ రెడ్డికి వైకాపా కార్యకర్త కృష్ణమూర్తి వల వేశాడు. ఇందుకోసం ముగ్గురు మహిళలను ప్రయోగించాడు. వారి మాయమాటలు నమ్మిన శంకర్‌రెడ్డి... ఈ నెల మూడో తేదీన 35 లక్షల డబ్బుతో తిరుపతికి వచ్చాడు. అప్పటికే కాపు కాసిన కృష్ణమూర్తి ముఠాలోని ఏడుగురు యువకులు... శంకర్ రెడ్డి కళ్లలో కారం చల్లి డబ్బుల సంచితో పరారయ్యారు. శంకర్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు... చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద కారుతో పాటు ఏడుగురు యువకులను అరెస్ట్ చేశారు. అయితే సొమ్ము మాత్రం దొరకలేదు. వారిచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు... కుప్పంకు చెందిన సూత్రధారి కృష్ణమూర్తిని అరెస్టు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణమూర్తిపై ఆంధ్రా, కర్ణాటకలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ముఠాలోని ముగ్గురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడో తేదీన పట్టుబడిన ఏడుగురు యువకులు... కుప్పం వైకాపా నాయకుడి ప్రధాన అనుచరులని తెలుస్తోంది.
Robbery case: దోపిడీ కేసులో సూత్రధారి, వైకాపా కార్యకర్త అరెస్ట్ - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Tirupati robbery case: తిరుపతిలో సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో సూత్రధారి, వైకాపా కార్యకర్త కృష్ణమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 32.5 లక్షల నగదు, ఓ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. మూడో తేదీన పట్టుబడిన ఏడుగురు యువకులు.. కుప్పం వైకాపా నాయకుడి ప్రధాన అనుచరులని తెలుస్తోంది.
దారి దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్
Last Updated : Nov 10, 2022, 3:46 PM IST