- ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. వైసీపీ ఇంటికెళ్లడం ఖాయం: చంద్రబాబు
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా పొందూరులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. పొందూరు చేనేత కార్మికులకు అండగా ఉంటామని చంద్రబాబు హామి ఇచ్చారు.
- అప్పుడు సత్కరించారు.. ఇప్పుడు తీసేస్తున్నారు.. పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన
కరోనా వేళ ప్రాణాలకు తెగించి పనులు చేసిన తమకు 2నెలలుగా జీతాలు చెల్లించకపోవడమే కాకుండా విధుల నుంచి తొలగించారంటూ సీఆర్డీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పాటు..ఉద్యోగాల కొనసాగింపుపై ఉన్నతాధికారులను సంప్రదిస్తామని నచ్చజెప్పారు.
- రుషికొండ తవ్వకాలపై ఐదుగురు కేంద్ర అధికారులతో కమిటీకి హైకోర్టు ఆదేశం
రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన కమిటీలో ఉన్న రాష్ట్ర అధికారులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది.
- ఆ భవనాలు పాఠశాలలకు ఇస్తాం.. హైకోర్టులో ప్రభుత్వం
పాఠశాల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితోపాటు.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీ హైకోర్టులో హాజరయ్యారు. పాఠశాలల ఆవరణల్లో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను పాఠశాల వినియోగానికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వాధికారులు హైకోర్టుకు తెలిపారు.
- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఫిక్స్.. దరఖాస్తుల స్వీకరణ అప్పటి నుంచే..
ఐఐటీ కాలేజీల్లో అడ్మీషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారయ్యింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు.
- భారత్- చైనా 17వ విడత చర్చలు.. సరిహద్దు సమస్యకు త్వరలోనే పరిష్కారం!
తూర్పు లద్ధాఖ్‌లో భద్రతను, స్థిరత్వాన్ని కొనసాగించాలని భారత్, చైనా సైన్యాలు నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలిన సమస్యల పరిష్కారానికి ఈనెల 20న చర్చలు జరిపిన ఇరు సైన్యాలు.. పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాయి. తవాంగ్ సెక్టార్ తాజా ఘర్షణ నేపథ్యంలో జరిగిన ఈ చర్చలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిశాయి.
- నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశం.. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల!
ఆరోగ్య కారణాల రీత్యా అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నేపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శోభరాజ్‌పై పెండింగు కేసులు లేకపోతే విడుదలైన తర్వాత స్వదేశానికి పంపేయాలని కోర్టు సూచించింది.
- ఈ ఏడాదే ఉద్యోగంలో చేరారా? పన్ను మాటేంటి?
పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. అయితే ఈ పన్నులను భారం తగ్గించుకోవాలంటే ఆదా చేసే పెట్టుబడులను ఎంచుకోవాలి. పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరి అవేంటో తెలుసుకుందాం రండి..
- కరెన్సీపై మెస్సీ ఫొటో.. ఆ దేశం కీలక నిర్ణయం!
మెస్సీ ప్రభంజన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో వార్త అతడి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అర్జెంటీనా కరెన్సీపై మెస్సీ ఫొటో ముద్రించబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..
- దుబాయ్ పోలీసుల అదుపులో ఉర్ఫీ జావెద్ నిజమెంత
వింత డ్రెస్సులు, వివాదస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ను దుబాయ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలేం జరిగిందంటే..
ఏపీ ప్రధాన వార్తలు