శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. ఇచ్ఛాపురం మండల వెలుగు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సాయిరాజ్... 72 లక్షల విలువైన చెక్కును సున్నావడ్డీ పథకం ద్వారా మహిళా సంఘాలకు అందించారు. అనంతరం ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో ఒక కోటి 26 లక్షల 56 వేల చెక్కును మహిళల స్వయం సహాయక సంఘాలకు అందించారు.
'మహిళల అభ్యున్నతే వైకాపా ప్రభుత్వ ధ్యేయం' - ఇచ్ఛాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అందిస్తున్నారని... డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ అన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సున్నా వడ్డీ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
!['మహిళల అభ్యున్నతే వైకాపా ప్రభుత్వ ధ్యేయం' yssar-zero-interest-scheme-launched-in-srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6922907-42-6922907-1587737726576.jpg)
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం
పాలకొండలో...
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ప్రతి మహిళా సంఘం సభ్యులు పొందాలని పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతి సూచించారు. పాలకొండ నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఆమె ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో 4197 స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 89 లక్షల రూపాయలు వడ్డీ రాయితీ కింద మహిళా సమాఖ్య బాధ్యులకు అందచేశారు.