YSRCP Uttarandhra Garjana program: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమం జరిగింది. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సత్యవరం కూడలి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ఈ ప్రదర్శన సాగింది. ఇందులో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు. గర్జనలో విద్యార్థులు జగనన్న పాటపై డీజే ముందు నృత్యం చేశారు. విశాఖ కేంద్రంగా రాజధాని... ఉత్తరాంధ్ర ప్రజలకు అవసరమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
నరసన్నపేటలో ఉత్తరాంధ్ర గర్జన... ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ - YSRCP Uttarandhra Garjana program in Srikakulam
YSRCP Uttarandhra Garjana program: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ ఆధ్వర్యంలో... భారీ ర్యాలీ చేశారు. గర్జనలో విద్యార్థులు జగనన్న పాటపై డీజే ముందు నృత్యం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమం