తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైయస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 'ఆహుతి' సినిమాలో విలన్‌ను ఎలాగైతే ఈడ్చి ఈడ్చి కొట్టారో అలాగే అచ్చెన్నాయుడును కూడా అలా కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్‌ను కాదంటూ ధ్వజమెత్తారు. మహానాడులో ఇష్టానుసారం మాట్లాడిన వారికి ఇదే తాను చేస్తున్న హెచ్చరిక అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై హద్దులు మీరి, పరిధులు దాటి మాట్లాడే వారికి ఇదే హెచ్చరిక అన్నారు. జగన్ కోసం ప్రాణాలు అర్పించడానికి ఆత్మాహుతి దళంగా మారిపోతానన్నారు. తనకు ప్రాణాలపై భయం లేదని, జీవితంపై ఆశ లేదని, ఎవర్నీ విడిచిపెట్టనని అన్నారు.
"'ఆహుతి' సినిమాలో విలన్‌ని కొట్టినట్లు... కొట్టకపోతే..!"
అచ్చెన్నాయుడు రోడ్డుపైకి వస్తే.. 'ఆహుతి' సినిమాలో విలన్‌ని కొట్టినట్లు కొడతానంటూ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఊగిపోయారు. తమ అధినేత జగన్‌పై ఆరోపణలు చేస్తే.. ఆత్మాహుతి దళంలా మారడానికి కూడా సిద్ధమేనంటూ వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ఇష్టానుసారం మాట్లాడిన వారు.. ఇంకోసారి నోరు జారొద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు.
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్