శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై వైకాపా నాయకులు దౌర్జన్యం కేసులో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీషతోపాటు అశోక్ పోలీస్ స్టేషిన్కు వెళ్లారు. వైకాపా నేతలను వెంటనే అరెస్టు చేయాలని , డీఎస్పీ మూర్తికి వినతి పత్రం అందించారు. పలాసపురం ఘటనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు అదే సమయంలో వైకాపా నాయకులు ఫిర్యాదు చేయాడానికి రావడంతో సోంపేట పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.