దేశం మొత్తాన్నీ కలవరపాటుకు గురిచేస్తున్న కోవిడ్ రెండో దశలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డుతోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ పరిస్థితులపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కోవిడ్ రోగులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వైద్య సేవలు సరిగా లేదనే ఫిర్యాదు.. ఒక్కటి కూడా నమోదుకాకూడదని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులకు సూచించారు. ఈ సమయంలో ముందస్తుగా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు.