శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట... పలాస, కాశీబుగ్గ, ఉద్దాన ప్రాంత ప్రజలు గురువారం ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గానొరెకు వినతిపత్రం అందించారు. 1981లో అప్పటి పోరాటాల పలితంగా రావెల నాగేశ్వరరావు కుమారుడు సాంబశివరావు నుంచి భూములు దానంగా పొందామని బాధితులు తెలిపారు. తాజాగా పలాసకు చెందిన వైకాపా నేత దువ్వాడ శ్రీధర్(బాబా) సంబంధిత భూములను వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. 40 గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు అ భూమిపై తరాలుగా ఆధారపడి బతుకుతున్నాయని.. తమకు న్యాయం చేయాలని కోరారు.
'తప్పుడు పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు' - srikakulam district newsupdates
కొందరు నేతలు తప్పుడు పత్రాలు సృష్టించి.. భూములు అక్రమంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని... ఉద్దాన ప్రాంత ప్రజలు ఆరోపించారు. 1981లో అప్పటి పోరాటాల పలితంగా రావెల నాగేశ్వరరావు కుమారుడు సాంబశివరావు నుంచి భూములు దానంగా పొందామని బాధితులు తెలిపారు. ఈ మేరకు టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గానొరెకు వినతిపత్రం అందించారు.
గ్రామానికి వచ్చి పరిశీలన జరుపుతామని... తగిన న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం వారు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నినాదాలు చేశారు. దువ్వాడ సోదరుల భూ కజ్జాలు అరికట్టాలని నినదించారు. పలాస తహసీల్దార్ కబ్జాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు బాబా... చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఆప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. ప్రశ్నించిన 22 మందిపై కేసులు నమోదు చేయించి హింసకు గురిచేయడం తగదన్నారు. తమ శాంతియుత పోరాటానికి పోలీసులు అడ్డుతగులుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.