ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పరిపాలన.. వైఫల్యాలమయం' - congress letter to ap acm

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలన దాదాపుగా వైఫల్యాలే అని.. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు విమర్శించారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

srikakulam district
90% వైకాపా పరిపాలనలో వైఫల్యాలే

By

Published : Jun 4, 2020, 2:48 PM IST

'9 అంశాలతో మీ పాలన.. మా సూచన' అంటూ.. కాంగ్రెస్ నేతలు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే అని.. పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ బాధ్యుడు కంబాల రాజవర్ధన్ విమర్శించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి... అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు తరలించడం ఏంటని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా పరిపాలన జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి తప్పుబట్టారు. పార్టీ నాయకుడు రమణ హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details