దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఘనంగా జరిగాయి. బస్టాండ్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. పురపాలక సంఘ కార్యాలయంలో వైఎస్ఆర్ పింఛన్లు ప్రారంభించారు. రేషన్ డీలర్లు వారి సమస్యల కోసం వినతి పత్రాన్ని వైకాపా మహిళా కన్వీనర్ సిరియా విజయకు అందించారు.
శ్రీకాకుళంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి - YSR birthday celebrations
ఇచ్చాపురం బస్టాండ్ కూడలి లో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.
YSR birthday celebrations at srikakulam district