MLC DUVVADA: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న వైకాపా శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌ను ఓ నిరుద్యోగ యువకుడు జాబ్ కాలండర్ (JOB CALENDER) పై నిలదీశాడు. గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు. చివరికి రాజకీయ విమర్శల వరకు చర్చ వెళ్ళింది. ఓ దశలో ఎమ్మెల్సీ అనుచరులు, వైకాపా నేతలు ఆ యువకుడ్ని బలవంతంగా ఇంట్లోకి పంపించే ప్రయత్నం చేశారు. టెక్కలి మండలం మేఘవరం గ్రామంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దల్లి లోకేష్ అనే బిటెక్ విద్యార్థి ఎమ్మెల్సీని జాబ్ క్యాలెండర్ కోసం ప్రశ్నించాడు. జగన్ అంటే తనకు చాలా రెస్పెక్ట్ అని, ఆయన అభిమానిని అని చెప్పాడు. ప్రభుత్వ ఉచిత పథకాలు తప్ప మిగిలిన వాటికి సపోర్ట్ చేస్తానని అన్నాడు. దీనికి సమాధానం గా 4.50 లక్షల ఉద్యోగాలు జగన్ ఇచ్చారని , భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారని ఎమ్మెల్సీ ఇచ్చిన సమాధానం పై నిరుద్యోగ యువకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్ పాలనలో ఉద్యోగ ప్రకటనలు ఏవి?.. దువ్వాడను ప్రశ్నించిన యువకుడు - young man questioned duvvada on job calendar in tekkali
MLC DUVVADA: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని మేఘవరంలో పర్యటించిన ఆయనను గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు ఉద్యోగాల భర్తీపై ప్రశ్నించాడు. చివరకు ఈ చర్చ రాజకీయ విమర్శల వరకు వెళ్లింది.
చంద్రబాబు పెట్టిన రూ.18 వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అప్పును జగనే తీర్చారని ఎమ్మెల్సీ అన్నారు. దీనికి సమాధానం గా 2016, 2018 లో చంద్రబాబు సార్ నోటిఫికేషన్ తీశారని, అతని హయాంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదని యువకుడు సమాధానం చెప్పడంపై ఎమ్మెల్సీ చిర్రు బుర్రు లాడారు. ఇది కాస్త, రాజకీయ విమర్శలకు దారితీస్తుండటంతో, ఎమ్మెల్సీ అనుచరులు, పార్టీ నేతలు యువకుడిని నిలువురించే ప్రయత్నం చేశారు. చివరకు నోటిఫికేషన్ రాకుంటే ఆ బాధేంటో మీకూ తెలుస్తుందంటూ నిరుద్యోగి నిట్టూర్చాడు..
ఇవీ చదవండి: