ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గర్భిణి అయిన భార్యను చూసేందుకు వెళ్తూ... మృత్యు ఒడికి - శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదం వార్తలు

వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి. అయితే వీరి అన్యోన్య దాంపత్యంపై వీధి కన్ను గీటిందా అన్నట్లుగా అతన్ని రోడ్డు ప్రమాదం కబలించింది. భార్యను చూసేందుకు పయనమైన అతను మృత్యు ఒడికి చేరాడు.

Young man dies while going to see his pregnant wife
Young man dies while going to see his pregnant wife

By

Published : Jul 5, 2020, 9:30 PM IST

భార్య ప్రసూతి సమయంలో పక్కనే ఉందామని బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన అల్లు అమ్మ నాయిడు.. విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పన్నెండేళ్లుగా మెకానికల్ ఇంజినీర్​గా పని చేస్తున్నాడు. ఆయనకు ఓ యువతితో గతేడాది వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి.

అతని భార్యకు ఈ నెల 8న ప్రసూతి సమయంగా వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో తన భార్య దగ్గర ఉండాలని అమ్మ నాయుడు ఆదివారం ఉదయం యలమంచిలి నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామం దూకులపాడుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం-పూసపాటిరేగ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అమ్మ నాయుడు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. గర్భవతి అయిన అతని భార్య గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.

ABOUT THE AUTHOR

...view details