విద్యుదాఘాతంతో యువకుడి మృతి - Young man dead at srikakulam news
చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబానికి పెద్ద కొడుకే చేదోడు వాదోడు అయ్యాడు. డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రైవేటు రాళ్ళ క్వారీలోని పనిలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఆ యువకుడిని మృత్యువు కబళించింది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కృష్ణాపురం సమీపంలో ఉన్న రాళ్ళ క్వారీలో పని చేస్తున్న లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన పిట్టా అప్పలనాయుడు (20) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. విద్యుత్ షాక్కు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లి బోరున విలపిస్తోంది. అందరితో కలిసి మెలసి ఉన్న అప్పలనాయుడు అకస్మికంగా దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పొందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.