ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్‌ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం ఎర్రన్నాయుడిది' - ఎర్రన్నాయుడుకు నివాళులర్పించిన చంద్రబాబు

ఎన్టీఆర్‌ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం ఎర్రన్నాయుడిదని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు.

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

By

Published : Feb 23, 2020, 12:03 PM IST

చంద్రబాబు ట్వీట్

తెదేపా దివంగత నేత ఎర్రన్నాయుడుకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రజానాయకుని సేవలను స్మరించుకుందామని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలనే కాకుండా, ఎన్టీఆర్​ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం ఎర్రన్నాయుడుదని కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details