తెదేపా దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్థంతిని శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం ఎంపీ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఎర్రన్నాయుడు సృగ్రామమైన కోటబోమ్మాళి మండలం నిమ్మాడలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎర్రన్నాయుడు ఘాటు వద్ద ఆయన భార్య విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అదిరెడ్డి భవానీ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు, తెదేపా కార్యకర్తలు, ఎర్రన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళ్లు అర్పించారు.
Yerrannaidu Vardhanthi: ఎర్రన్న కలల సాకారం దిశగా అడుగులు: రామ్మోహన్‌నాయుడు
దివంగత తెదేపా నేత కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్థంతిని శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం ఎంపీ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఎర్రన్న కలల సాకారం దిశగా అడుగులు -రామ్మోహన్‌నాయుడు
అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎర్రన్న ఆశయ సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన తండ్రి కన్న కలలను సాకారం చేసేలా పనిచేస్తున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి : BIG FISH: మత్స్యకారుల వలకు చిక్కిన 130 కిలోల భారీ సొర చేప