శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు ఏడో వర్ధంతి నిర్వహించారు. శ్రీకాకుళం ఎంపీ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడులో ఎర్రన్నాయుడు ఘాటు వద్ద భార్య విజయకుమారి, ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అదిరెడ్డి భవానీ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఆయన ఆశయ సాదనకు కృషి చేస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆ దిశగా పని చేస్తున్నామన్నారు.
ఎర్రన్న ఆశయ సాధనకు కృషి: ఎంపీ రామ్మోహన్ నాయుడు - latest news on yerranaidu
శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు వర్ధంతి నిర్వహించారు. ఆయన కన్న కలలను సాకారం చేసేలా పనిచేస్తున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఎర్రన్నాయుడు వర్ధంతి