ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ధరలు పెరిగింది వాస్తవమే: మంత్రి ధర్మాన ప్రసాదరావు - విద్యుత్ ధరలు పెరిగింది వాస్తవమే

YCP Samajika Sadhikara Bus Yatra in Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో సామాజిక సాధికార బస్సు చేపట్టింది. ఈ సందర్భంగా... రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. టీడీపీకి ఓట్లేసిన మత్స్యకారులకు చంద్రబాబుకు ఎం చేశాడని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఓటువేసి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలు పెరిగాయన్నది వాస్తవమేనని తెలిపారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రాజధానిగా ప్రకటించిందని పేర్కొన్నారు.

YCP Samajika Sadhikara
YCP Samajika Sadhikara

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 10:08 PM IST

Updated : Nov 28, 2023, 6:26 AM IST

విద్యుత్ ధరలు పెరిగింది వాస్తవమే: మంత్రి ధర్మాన ప్రసాదరావు

YCP Samajika Sadhikara Bus Yatra in Srikakulam: శ్రీకాకుళం ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకాపాలెం వద్ద వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. బస్సు యాత్రలో మంత్రులు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన పాలన చేస్తుందన్నారు. శ్రీకాకుళంలో టీడీపీకి ఓట్లేసిన మత్స్యకారులకు చంద్రబాబుకు ఎం చేశాడని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబుకి ఓటువేసి ప్రజలు మోసపోయారని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇచ్చి మన పీక మనమే కోసుకుంటామా.. అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలు పెరిగాయన్నది వాస్తవమేనని తెలిపారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రాజధానిగా ప్రకటించిందని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కావడం వల్ల ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఫిషింగ్ హార్బర్​తో ఆస్తుల విలువలు పెరుగుతాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.

మత్య్సకారులు మెుదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముతూ వచ్చారు. కానీ మత్య్సకారులను టీడీపీ మోసం చేసింది. మత్య్సకారుడిని ఎమ్మెల్యే చేసి, మంత్రిని చేసిన ఘనత జగన్​కు దక్కుతుంది. నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి, అలాంటివి పట్టించుకోకూడదు. చంద్రబాబు గతంలో వర్గాలను సృష్టిస్తున్నారు. కానీ జగన్ మాత్రం వివిధ సామాజిక వర్గాలను ప్రోత్సహించారు.

చంద్రబాబు ఎలాంటి ఆకాశం ఇవ్వలేదు: మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల్లో ఓడించాలని సీదిరి పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఎలాంటి ఆకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు అవమానించాడని పేర్కొన్నాడు. సీఎం జగన్ మాత్రం మత్స్యకారులను అక్కున చేర్చుకున్నాడని మంత్రి తెలిపారు. విశాఖ హార్బర్ లో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి స్పందించిన తీరు అద్భుతమని మంత్రి తెలిపారు. హార్బర్ లో బోట్లు నష్టపోయిన బాధితులకు 80 శాతం పరిహారం ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు నుంచి లోకేశ్ యాత్ర ప్రారంభమైందన్న మంత్రి.... లోకేశ్, జగన్మోహన్ రెడ్డికి భయాన్ని పరిచయం చేస్తానని అంటున్నాడని.. అతని బాబు వాళ్లే కాలేదని లోకేశ్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు.

TDP Leaders Bus Yatra: "దూసుకుపోతున్న టీడీపీ బస్సుయాత్ర.. మినీ మేనిఫెస్టోతో వైఎస్సార్సీపీ నాయకుల్లో వణుకు"

ఉపాధి హామీ కూలీలతో: ప్రతి గ్రామం నుంచి ఉపాధి హామీ కూలీలను, మహిళా సంఘాలకు చెందిన సభ్యులను ఆటోలో బలవంతంగా కార్యక్రమానికి తరలించారు. సభ ప్రారంభమై ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగానే సగం మంది వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కిరణ్ కుమార్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ministers Bus Yatra: నేటి నుంచి 'సామాజిక న్యాయ భేరి'.. మంత్రుల బస్సుయాత్ర

Last Updated : Nov 28, 2023, 6:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details