YCP PROTEST శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా చేస్తున్న వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం నేతలు గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెప్పినా.. వైకాపా నిరసన కార్యక్రమం చేసింది . ధర్నా చేస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వైకాపా నేతలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పలాసలో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా ధర్నా, పోలీసుల అదుపులో నేతలు - ఏపీ తాాజా వార్తలు
YCP PROTEST IN PALASA పలాసలో తెదేపా నాయకులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వైకాపా శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెప్పినా.. వైకాపా నిరసన కార్యక్రమం చేసింది .
ఇదీ జరిగింది..పలాసలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజుపై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గౌతు శిరీష వ్యక్తిగత దూషణలు, అనుచిత వాఖ్యలు చేస్తున్నారని.. ఆమె ఈ నెల 18వ తేదీలోగా క్షమాపణ చెప్పకపోతే 21న తెదేపా కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వైకాపా నాయకులు హెచ్చరించారు. ఆమె స్పందించకపోవడంతో వైకాపా నాయకులు ఆదివారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తెదేపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు జనసమీకరణ చేస్తున్నారు. ప్రతిగా తాము పార్టీ కార్యాలయంలోనే ఉంటామని.. ఎలా ముట్టడిస్తారో చూస్తామని గౌతు శిరీష పేర్కొన్నారు. ముట్టడిని ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు చేరుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: