పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతల బెదిరింపుల పర్వం నేటికి కొనసాగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామంలో ఓ వైకాపా నాయకుడు హెచ్చరిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పథకాలు కావలంటే వైకాపా మద్దతు దారునికే ఓటు వేయాలని బహిరంగంగా బెదిరింపులు చేశాడు.
'తెదేపా మద్దుతుదారులు గెలిస్తే రెండు నెలల్లో చెక్ పవర్ తీసేస్తా' - srikakulam district latest news
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైకాపా నేతలు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ మద్దుతు దారులను గెలిపించకపోతే ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తెదేపా తరఫు అభ్యర్థులు గెలిస్తే రెండు నెలల్లోనే వారి చెక్ పవర్ తీసేస్తాంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహ బెదిరింపులు వీడియోలు సామాజిక మాద్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
!['తెదేపా మద్దుతుదారులు గెలిస్తే రెండు నెలల్లో చెక్ పవర్ తీసేస్తా' ycp leaders threaten in panchayat elections in srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10652310-612-10652310-1613485561429.jpg)
"మా ప్రభుత్వం అధికారంలో ఉంది. వైకాపా మద్దుతుదారుడు గెలిస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తాం. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెదేపాకు చెందిన వారివి 40 పింఛన్లు తీసేస్తే... ఇప్పటివరకు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. తెదేపా బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తే.. రెండు నెలల్లో వారి చెక్ పవర్‌ను తొలగించేస్తా. అలాగే సర్పంచ్ పదవిని కూడా తీసేస్తా. సీఎం జగన్ అందరికీ పథకాలు ఇస్తున్నాడు కదా అని అవతల వ్యక్తికి ఓటు వేస్తే... ఆ పథకాలు ఎలా నిలుపుదల చేయాలో నాకు తెలుసు. నేను ఒకసారి పథకాలు తీసేస్తే అవి తిరిగి ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు తెలియదు. మేము బలపరిచిన అభ్యర్థులు గెలవకపోతే 21 తర్వాత మేం ఎంటో చూపిస్తాం". : వైకాపా నేత
ఇదీ చదవండి
'ప్రధానికి జగన్ దొంగ లేఖలు రాస్తున్నారు'
TAGGED:
బడివానిపేట వార్తలు