'మన పాలన మీ సూచన'లో భాగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై.. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మేథోమదన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్ పాల్గొన్నారు. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందన్న మంత్రి.. తద్వారా రాష్ట్రం బాగుంటుందన్నారు.
'మన పాలన మీ సూచన'పై మేథోమదన సదస్సు - శ్రీకాకుళంలో మన పాలన మీ సూచనపై మేథోమదన సదస్సు వార్తలు
అన్నదాతల కోసం వైకాపా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో మన పాలన-మీ సూచన కార్యక్రమంపై నిర్వహించిన మేథోమదన సదస్సులో పాల్గొన్నారు.
!['మన పాలన మీ సూచన'పై మేథోమదన సదస్సు ycp leaders meeting in mana palana me suchana program in srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7354742-862-7354742-1590493730167.jpg)
'మన పాలన మీ సూచన'పై మేథోమదన సదస్సు
అన్నదాతల కోసం రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చామన్నారు. ఉచితంగా పంటల భీమా అమలు చేస్తున్న రాష్ట్రం మనదేనని కృష్ణదాస్ కొనియాడారు. వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి.. తితిదే భూముల అమ్మకంపై భాజపా ప్రత్యేక సమావేశం
TAGGED:
srikakulam ycp leaders meet