శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం ఆరో వార్డులోని ఆరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మాస్కులు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి వైకాపా నేతలు సూచించారు. ఈ మేరకు మాస్కులను సచివాలయ ఉద్యోగులకు స్థానిక వైకాపా నేతలు సనపల శీను, రాజు అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
పేదలకు మాస్కులు ఇవ్వాలని సచివాలయ సిబ్బందికి అందజేత - free masks distribution in amadalavalasa
కరోనా వ్యాప్తి నివారణ కోసం పేదలకు మాస్కులు అందించాలని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వైకాపా నేతలు ముందుకు వచ్చారు. ఆరో వార్డులోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మాస్కులు అందించాలని సచివాలయ సిబ్బందికి వాటిని అందజేశారు.
పేదలకు మాస్కులు అందించాలని సచివాలయ సిబ్బందికి అందజేత