శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్ననపేటలో... వైకాపా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేసి వెళ్లిపోయిన అనంతరం పార్టీలోని ఇరు వర్గాల నాయకులూ దుస్తులు చిరిగేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
అక్కడే ఉన్న పార్టీ పెద్దలు.. వారికి నచ్చజెప్పగా వివాదం సద్దుమణిగింది. సొంతపార్టీలో ఉన్నవాళ్లే ఇలా దాడి చేసుకోవడం ఏంటంటూ.. పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. పాత కక్షలు మనసులో పెట్టుకొనే వీధి పోరాటానికి దిగినట్లు నాయకులు భావిస్తున్నారు.