ఉత్తరాంధ్రలో కరోనా కేసులు పెరగటానికి అధికారపార్టీ నేతల విచ్చలవిడి పర్యటనలే కారణమని.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. విశాఖను రాజధాని చేస్తామన్న నేతలు... కరోనా కేసుల్లో ఉత్తరాంధ్రను అగ్రభాగాన నిలిపారని మండిపడ్డారు. పాలకల నిర్లక్ష్యం కారణంగానే దేశంలోనే అత్యధిక కొవిడ్ కేసులున్న జిల్లాల్లో విశాఖ, శ్రీకాకుళం ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా కేసులు పెరగటానికి వైకాపా నేతలే కారణం: గౌతు శిరీష - Gouthu Shireesha Latest News
కరోనా కేసులు పెరగటానికి అధికారపార్టీ నేతల విచ్చలవిడి పర్యటనలే కారణమని.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. కరోనా తీవ్రతలో వైకాపా నేతలు మందులు, ఇంజెక్షన్లు, పడకలు, ఆక్సిజన్ సిలిండర్లతో వ్యాపారం సాగించారని తీవ్ర విమర్శలు చేశారు.
గౌతు శిరీష
కరోనా తీవ్రతలో వైకాపా నేతలు మందులు, ఇంజెక్షన్లు, పడకలు, ఆక్సిజన్ సిలిండర్లతో వ్యాపారం సాగించారని తీవ్ర విమర్శలు చేశారు. తన ఆదాయం పెంచుకోవటంపై జగన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యం పట్ల లేదన్నారు. తమకిష్టమొచ్చినట్లు పన్నులు, ధరలు పెంచుతామని విజయసాయిరెడ్డి అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, అధిక సంపాదనపైనే పాలకుల ఆలోచనలు ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు.
ఇదీ చదవండీ... 'సీఎం విడుదల చేసింది ఓ చీటింగ్ క్యాలెండర్'