లాక్డౌన్తో పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పక్కదారి పడుతోంది. రూ 1000 నగదు పంపిణీని అధికార పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఈ నగదును వాలంటీర్లు పంపిణీ చేయాల్సి ఉండగా వైకాపా నాయకులు సైతం లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శనివారం ఉదయం ఈ తతంగం నడిచింది. ఇటీవల వాయిదాపడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ పంపిణీలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న నగర పంచాయతీ కమిషనర్ వాలంటీర్లను హెచ్చరించారు. అనంతరం వైకాపా నాయకులు మెల్లగా జారుకున్నారు.
పేదలకు సాయంపై అధికార పార్టీ స్టిక్కర్! - పేదలకు ఆర్థిక సాయం
పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని వైకాపా నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. వాలంటీర్లతో పాటు వారు కూడా నగదును లబ్ధిదారులకు అందిస్తున్నారు.

ycp leaders are distributing the cash which was given by the government to poor