ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్టులో సాక్ష్యం చెప్పాడన్న కోపంతో.. టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేత దాడి - Andhra Pradesh latest news

Land Dispute In Srikakulam: భూ వివాదంలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడన్న కారణంతో.. టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన బాధితుడుని స్థానికులు 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడి దాడి
టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడి దాడి

By

Published : Dec 7, 2022, 12:25 PM IST

Land Dispute In Srikakulam: భూ వివాదంలో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడన్నకోపంతో.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్త తెలుగుదేశం సానుభూతిపరుడిపై దాడి చేశాడు. వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురానికి చెందిన వాకాటి ఏర్రయ్యను గొరకల వెంకటరావు ఈడ్చు కెళ్లి రక్తం వచ్చేటట్టు కొట్టాడు. వెంకటరావుకు, గ్రామానికి చెందిన దండాసి మధ్య స్థల వివాదం ఉంది. ఆ వివాదానికి సాక్షిగా ఉన్న వాకాటి ఏర్రయ్య.. కోర్టులో వెంకటరావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఆ కోపంతోనే దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు..

సాక్ష్యం చెప్పాడన్న కారణంతో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడి దాడి

ABOUT THE AUTHOR

...view details