వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిని సీఐపై చేయి చేసుకున్న ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. జడ్పీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారిని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ లలిత వరుసగా పంపుతున్నారు. సరుబుజ్జిలి వైకాపా అభ్యర్థిని లక్ష్మీనరసమ్మ క్యూను తప్పించుకుని వెళ్లబోయారు. అడ్డుకోబోయిన సీఐపై చేయి చేసుకున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి అక్కడకు చేరుకుని ఆరాతీశారు. పొరపాటున చేయి చేసుకున్నానని, మన్నించాలంటూ సీఐకి క్షమాపణ చెప్పడంతో విడిచిపెట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సీఐ ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళంలో సీఐపై చేయిచేసుకున్న వైకాపా అభ్యర్థిని - శ్రీకాకుళంలో సీఐపై వైకాపా అభ్యర్థిని దాడి
జడ్పీటీసీ నామినేషన్లు వేయడానికి వెళ్లిన సరుబుజ్జిలికి చెందిన వైకాపా అభ్యర్థిని లక్ష్మీనరసమ్మ.. శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ లలితపై దురుసుగా ప్రవర్తించింది. క్యూలో నిల్చోని నామినేషన్లు వేయమన్న సీఐపై చేయిచేసుకున్నారు.
ycp candidate slaped on CI face at Srikakulam