శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామంలో ఇరుపార్టీల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు కత్తులతో, కర్రలతో దాడి చేశారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన కిలుగు వెంకట్రావు, బాకీ చిరంజీవులు, కిలుగు నూకరాజు, కిలుగు తిరుపతి సోంపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైకాపా కార్యకర్తలు బాకీ లక్ష్మీనారాయణ, బి. సచిన్, కిలుగు సింహాద్రి, గుమ్మడి తేజెస్, కర్రీ సారధి దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అశోక్ బాబు పరామర్శించారు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సోంపేట పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేసే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
సోంపేట పీఎస్ వద్ద ఎమ్మెల్యే అశోక్ బాబు ఆందోళన - Clashes in Arjunapuram, Srikakulam district
వైకాపా కార్యకర్తల దాడిలో తెదేపా కార్యకర్తలు గాయపడిన ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామంలో జరిగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన బాధితులు సోంపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అశోక్ బాబు సోంపేట పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యే అశోక్ బాబు సోంపేట పీఎస్ వద్ద ఆందోళన