శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నక్కపేట గ్రామంలో స్థల వివాదంపై ఇరువర్గాలు గొడవ పడ్డాయి. అముజూరి పోతురాజు తనకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో పశువులపాక వేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు... అడ్డుకున్న కారణంగా ఘర్షణకు దిగారు. రాజు అనే వ్యక్తి గాయపడగా... ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.